‘సదరం’లో కంటి పరీక్షలు
ABN , Publish Date - May 16 , 2025 | 11:38 PM
‘సదరం’లో కంటి పరీక్షలు
2230మందికి రీ వెరిఫికేషన్ పూర్తి
నంద్యాల హాస్పిటల్, మే 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సదరం క్యాంప్‌లో రీ వెరిఫికేషన్‌లో భాగంగా కంటిచూపు కోల్పోయిన దివ్యాంగులకు ప్రత్యేక శిబిరంలో పరీక్షలు పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా 2230మంది దివ్యాంగులు రీ వెరిఫికేషన్ చేయించుకున్నారు. జనవరి 21నుంచి మే 9వ తేదీ వరకు సదరం క్యాంప్‌లో కంటి పరీక్షలకు సంబంధించి రీ వెరిఫికేషన్ జరిగింది. శుక్రవారం నంద్యాల జీజీహెచ్‌లో ఆర్థో 132మంది, వినికిడి లోపం ఉన్నవారు 44మంది, మానసిక వికలాంగులు 35మంది రీ వెరిఫికేషన్ కోసం హాజరయ్యారు.