Share News

పోలీసుల విస్తృత తనిఖీలు

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:53 PM

జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యపానం చేస్తున్న వారిపై దాడులు చేసినట్లు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా శుక్రవారం తెలిపారు.

పోలీసుల విస్తృత తనిఖీలు
వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై నజీర్‌

బహిరంగ మద్యపానం చేస్తున్న 111మందిపై కేసు

నంద్యాల క్రైం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యపానం చేస్తున్న వారిపై దాడులు చేసినట్లు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా శుక్రవారం తెలిపారు. బహిరంగ ప్రాంతంలో మద్యం సేవిస్తున్నవారిపై 111 కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 26 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. మోటార్‌ వాహన చట్టం ఉల్లంఘించిన 194 మందిపై రూ.97,640 జరిమానా విధించామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 26 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే బహిరంగ మద్యపానం, జూదం, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేకంగా డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. నిర్మానుష్య ప్రదేశాలు, తోటలు, పట్టణ, గ్రామ శివారు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించేవారిపై డ్రోన్‌ కెమెరాలతో నిఘావేసి వాటివల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Apr 25 , 2025 | 11:53 PM