పూర్వ విద్యార్థుల కలయిక
ABN , Publish Date - May 26 , 2025 | 12:00 AM
మండలంలోని గోవర్దనగిరి జడ్పీహెచ్ పాఠశాల 1996-2001 పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు.
వెల్దుర్తి, మే 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవర్దనగిరి జడ్పీహెచ్ పాఠశాల 1996-2001 పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారు. తాము చేసిన అల్లర్లను స్నేహితులతో పంచుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఉపాధ్యాయులు అన్వర్‌బాషా, ప్రభుచరణ్, శ్రీనివాసరెడ్డి, రమాదేవి, శ్రీనివాసకుమార్, ఎండీ కృష్ణయ్య, పీఈటీ మెహబూబ్ బాషా, కృష్ణమూర్తి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను తమను గుర్తుపెట్టుకోవడంతో సంతోషంగా ఉందన్నారు.
పూర్వ విద్యార్థుల కలయిక ఆలూరు, మే25(ఆంధ్రజ్యోతి):
పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల-1లో 2001-02 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 23 యేళ్ల తర్వాత తమ స్నేహితులను చూసి ఆనందాన్ని పంచుకున్నారు. ఆట, పాటలతో సందడి చేసి అందరూ తీపి గుర్తుగా గ్రూప్ ఫొటో తీసుకున్నారు.