డీఎస్సీ నియామకాలపై కసరత్తు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:05 AM
మెగా డీఎస్సీ-2025 రిక్రూట్‌మెంట్ ద్వారా నియామకా లను పూర్తి చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారం భించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో మొత్తం 2645 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఖాళీల వివరాలు పంపాలన్న ఉన్నతాధికారులు
పోస్టుల భర్తీతో బదిలీ అయిన రిలీవ్ కాని వారికి ఊరట
కటాఫ్ మార్కులపై అభ్యర్థుల్లో టెన్షన్
మిగిలిన ఖాళీల్లో విద్యా వలంటీర్లకు ఛాన్స్?
ఆలూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025 రిక్రూట్‌మెంట్ ద్వారా నియామకా లను పూర్తి చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారం భించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో మొత్తం 2645 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డీఎస్సీలో అభ్యర్థులు సాధించిన మార్కులను విడు దల చేసిన విద్యాశాఖ తదుపరి మెరిట్ జాబితా, రిజర్వేషన్ కం రోస్టర్ మార్గదర్శకాల మేరకు సెలక్షన్ జాబితా, అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, పోస్టింగ్‌కు కౌన్సెలింగ్ ద్వారా నియామకాల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంది. ఈనేపథ్యంలోనే నియామకాల ప్రక్రియలో భాగంగా జిల్లాల వారీగా వివరాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశిం చారు. డీఎస్సీ-2025లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో నోటిఫై చేసిన మొత్తం పోస్టుల సంఖ్యను మేనేజ్ మెంట్, కేటగిరీ, మీడియం, సబ్జెక్టుల వారీగా పం పాలని సూచించారు. ఈనెల 31వ తేదీ నాటికి ఏర్పడే ఖాళీల సంఖ్యను ఇదే ఫార్మెట్‌లో అందజేయాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు కేటాయించేందుకు పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు, అసలు టీచరే లేకుండా కేటగిరీ-3/4లో ఉన్న స్కూళ్ల వివరాలు, ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నూతన స్థానాలకు బదిలీ అయిన రిలీవర్ లేక పాత స్కూల్‌లోనే కొనసాగుతుంటే ఆ స్కూలు వివరాలు, 50 శాతం మందికి పైబడి టీచర్లు కూడా లేని పాఠశాలలు, కేటగిరీ- 3/4ల్లోని స్కూళ్లలో ఇంకా ఎన్ని వెకెన్సీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. తదితర వివరా లన్నింటినీ సేకరించడానికి ఉమ్మడి జిల్లాస్థాయిలో ఈనెల 18న బృందాలను ని యమించారు. నిర్ణీత ఫార్మెట్‌లో క్షేత్రస్థాయి నుంచి డేటాను తీసుకో వాలని ఆదేశించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మెగా డీఎస్సీ-2025 రిక్రూట్‌మెంట్ ఈ మండలాల్లోని టీచర్ పోస్టులన్నీ భర్తీ కావడంతో పాటు బదిలీ ఖరారైనప్పటికీ రిలీవర్ లేక ఇప్పటికీ పాత స్థానాల్లోనే కొనసాగుతున్న ఉపాధ్యాయులకు ఊరట లభించడం ఖాయమని చెప్పవచ్చు.
ర్యాంక్ కార్డు మార్కుల ఆధారంగా..
ర్యాంక్ కార్డులో వచ్చిన మా ర్కుల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందా రాదా ప్రభుత్వం మెరిట్, రోస్టర్ ఆధారంగా ఎన్ని మార్కు లకు కటాఫ్ రావొచ్చు అనే ఆందోళనలో అభ్యర్థులు తలమునకలవుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కటాఫ్ మార్కులపై వస్తున్న పోస్టింగ్‌లతో కొందరిలో ఆశలు... మరికొందరిలో నిరాశ వ్యక్తమవుతు న్నాయి. రేపటిలోగా మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈనెల 21న ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించేం దుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల నుంచి కౌన్సెలింగ్ కోసం హెచ్‌ఎంలు, కంప్యూటర్ ఆపరేటర్లను డిప్యూటేషన్ వేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.
ఖాళీలను గుర్తిస్తున్నాం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, ఏ స్కూల్‌లో ఏ సబ్జెక్ట్ పోస్టు ఖాళీగా ఉంది. బదిలీల తర్వాత ఏర్పడే ఖాళీలు, ఇప్పటివరకు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలు, తదితర వివరాలను పంపాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. రోస్టర్, మెరిట్, కటాఫ్ మార్కులు క్యాటగిరీల వారీగా ప్రభుత్వం నిర్ణయిం చనుంది. డీఎస్సీలో ప్రకటించిన పోస్టులు భర్తీ చేశాక మిగిలిన ఖాళీలను విద్యా వలంటీర్ల ద్వారా భర్తీ చేస్తాం.
శామ్యూల్‌పాల్, డీఈవో, కర్నూలు