Share News

కేఎంసీలో అ‘పూర్వ’ సమ్మేళనం

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:22 AM

కేఎంసీ(కర్నూలు మెడికల్‌ కాలేజీ)లో 2000వ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మెడికల్‌ కాలేజీలోని న్యూ ఆడిటోరియంలో జరిగింది.

కేఎంసీలో అ‘పూర్వ’ సమ్మేళనం
2000వ బ్యాచ్‌కు చెందిన కేఎంసీ పూర్వ విద్యార్థులు

25 ఏళ్ల తర్వాత కలుసుకున్న కర్నూలు వైద్య కళాశాల విద్యార్థులు

గురువులకు సన్మానం

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కేఎంసీ(కర్నూలు మెడికల్‌ కాలేజీ)లో 2000వ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మెడికల్‌ కాలేజీలోని న్యూ ఆడిటోరియంలో జరిగింది. సోమవారం కేఎంసీ 2000 బ్యాచ్‌కు చెందిన 150 మందిలో 80 మంది పూర్వ విద్యార్థులు అమెరికా, ఇంగ్లాండు, దుబాయి, ఆస్ర్టేలి యాతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వైద్యులు టైటాన్స్‌ రీయూనియన్‌ పేరుతో కలుసుకున్నారు.

25 ఏళ్ల అనంతరం కలుసుకుని వైద్యులు ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువులు కంటి వైద్యులు డా.పి.సుధాకర్‌రావు, సీనియర్‌ ఫిజిషియన్‌ డా.భవానీప్రసాద్‌, డా.గిడ్డయ్య, డా.విష్ణుప్రసాద్‌, పథాలజి హెచ్‌వోడీ డా.బాలేశ్వరి, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లును ఘనంగా సన్మానించారు. అనంతరం కాలేజీ అంతా తిరిగారు. కార్యక్రమంలో 2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు కార్డియాలజిస్టు డా.పి.ప్రశాంత్‌, డా.శివబాల, డా.జాన్‌ (హైదరాబాదు), డా.ఫణికిషోర్‌, డా.రాఘవ, డా.సుబ్బారెడ్డి(యూఎస్‌ఏ), డా.అర్బన్‌, డా.హేమలత, కార్డియాలజిస్టు డా.మహ్మద్‌ ఆలి వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:22 AM