యాభై ఏళ్లకు కలిశారు
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:09 AM
పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాల 1973-74 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహిం చారు
1973-74 పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఆదోని/ఆదోని అగ్రికల్చర్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాల 1973-74 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహిం చారు. అరే నువ్వు రామాంజినేయులు కదా ఎలా ఉన్నావ్? ఎమ్మెల్సీ శివరామిరెడ్డి బాగున్నావా? అంటూ మిత్రులు అప్యాయంగా పలకరించు కున్నారు. దాదాపు 34 మందికి పైగా కలవడంతో పండుగ వాతావరణం చోటుచేసుకుంది. నాటి ఉపాధ్యాయులు దస్తగిరి, శ్రీనివాస్ రావు, నాగరాజు, ప్రస్తుత హెచ్‌ఎం ఫయాజ్‌ను సన్మానించారు. ఎమ్మెల్సీ శివరామి రెడ్డి సీపీఎం నాయకుడు రామాంజనేయుటు రెహమాన్ మాట్లాడుతూ టీచర్లను సన్మానించడం సంతోషమన్నారు.