విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:28 AM
నలభై ఏళ్ల క్రితం ఒకే పాఠశాలలో వారందరూ విద్యనభ్యసించారు.
40ఏళ్ల తర్వాత పాఠశాలలో కలుసుకున్న స్నేహితులు
డోన్ టౌన్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నలభై ఏళ్ల క్రితం ఒకే పాఠశాలలో వారందరూ విద్యనభ్యసించారు. ప్రస్తుతం తెలంగాణ, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో, హోదాల్లో స్థిరపడ్డారు. అయినప్పటికీ వారి స్నేహ బంధాన్ని మరువలేరు. ఎలాగైనా కలుసుకోవాలనుకున్నారు. వెంటనే ఒకరికొకరు ఫోన్లు చేసుకుని సమావేశమయ్యారు. డోన్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1984-85లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు పట్టణంలోని తాము చదువుకున్న పాఠశాలలో శనివారం సమ్మేళనం నిర్వహించారు. నాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నాడు చదువులు చెప్పిన గురువులైన సుజన ప్రభ, నిర్మలమ్మ, దానమ్మ, వాసు, ప్రభకుమారి, జయరాం, సుబ్బలక్ష్మి, సీతారామయ్య, హిందీ, పీఈటీ టీచర్లను పూలమాలలు, శాలువలతో సన్మానించి వారి ఆశీర్వాదాలు పొందారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు అన్నారు. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు కృషి చేసిన పూర్వ విద్యార్థినులు టి.లక్ష్మీబాయి, నాగరాజకుమారి, హరిప్రియ, గ్రేసీ, తులసిని అభినందించారు.