Share News

‘పంద్రాగస్టు’కు సర్వం సిద్ధం

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:16 AM

స్వాతంత్య్ర వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

‘పంద్రాగస్టు’కు సర్వం సిద్ధం
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లు

హాజరుకానున్న రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈవేడుకలకు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సాయుధ దళాల కవా తు, ప్రభుత్వ విభాగాల శకట ప్రదర్శన, బాలబాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్‌, అవార్డులు, ప్రశంసాపత్రాల ప్రదానం వంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. దేశభక్తిని పెంపొందించేలా, మన సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ వేడుకల్లో జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:16 AM