Share News

ప్రతి అర్జీని పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:42 PM

ప్రజా సమ స్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతిఅర్జీని పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

ప్రతి అర్జీని పరిష్కరించాలి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రజా సమ స్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతిఅర్జీని పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె అధికారులతో మాట్లాడారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత తప్పనిసరిగా పాటిం చాల న్నారు. జిల్లాలో గతేడాది జూన్‌ 15నుంచి ఇప్పటివరకు మొత్తం 43,143 అర్జీలు స్వీకరించబడ్డాయన్నారు. సరైన రీతిలో ఎండార్స్‌ చేయకపోవడంతో 471 దరఖాస్తులు రీ ఓపెన్‌ అయ్యాయన్నారు. ప్రతి అధికారి రీ-ఓపెనైనా అర్జీలపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్‌ బ్యాక్‌ సేకరణలో డోన్‌ రూరల్‌, గడివేముల, గోస్పాడు, జూపాడుబంగ్లా, మిడుతూరు, సం జామల, రుద్రవరం, పాములపాడు, వెలుగోడు మండలాలు రెండు వారాలుగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గుర్తించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌, డీఆర్వో రామునాయక్‌, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 11:42 PM