ప్రతి రైతు శాస్త్రవేత్త కావాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:52 PM
గ్రామాల్లో ప్రతి రైతు శాస్త్రవేత్త కావాలని జిల్లా ఉద్యానశాఖ శాస్త్రవేత్త దీప్తి అన్నారు.
జిల్లా ఉద్యానశాఖ శాస్త్రవేత్త దీప్తి
చాగలమర్రి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రతి రైతు శాస్త్రవేత్త కావాలని జిల్లా ఉద్యానశాఖ శాస్త్రవేత్త దీప్తి అన్నారు. బుధవా రం మండలంలోని చిన్నవంగలి గ్రామంలో అరటిసాగుపై రైతులకు మెలకువలు, యాజ మాన్య పద్ధతులపై అవగాహన కల్పిం చారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వాతా వరణ పరిస్థితుల్లో అరటిలో తీగతోక మచ్చ తెగుళ్లు ఉధృతి ఉందని అన్నారు. ఈ తెగుళ్లకు సకాలంలో గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వార నివారించచ్చని అ న్నారు. కార్యక్రమం లో ఆళ్లగడ్డ ఉద్యానశాఖ అధికారి దస్తగిరి, ఏవో రంగనేతాజీ, వీహెచఏ ఫరూక్, రైతులు పాల్గొన్నారు.