Share News

ప్రతి పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:30 AM

ప్రతి పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలని కలెక్టర్‌ రంజిత బాషా అన్నారు.

ప్రతి పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలి: కలెక్టర్‌
హర్‌ ఘర్‌ తిరంగ క్యాండిల్‌ లైట్‌ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ రంజిత బాషా

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ప్రతి పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలని కలెక్టర్‌ రంజిత బాషా అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా క్యాండిల్‌ లైట్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్‌ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు హర్‌ ఘర్‌ తిరంగా (ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా) కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మన దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం గురించి తెలుసుకో వడం ద్వారా దేశం పట్ల గౌరవం పెంచు కోవాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో బాధ్యతాయు తంగా మెలగడం కూడా దేశభక్తిలో భాగమేని అన్నారు. హర్‌ ఘర్‌ తిరంగా ప్రదర్శనలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డీపీవో భాస్కర్‌, సీఈవో సెట్కూరు వేణుగోపాల్‌, పీఆర్‌ ఎస్‌ఈ మద్దన్న, జిల్లా టూరిజం అధికారి లక్ష్మీనారాయణ, డీఈవో శామ్యూ ల్‌పాల్‌ అధికారులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:30 AM