ఫీజులు కట్టినా పరీక్షలు రాయించలేదు
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:55 AM
తాము ఫీజులు కట్టినా హాల్ టికెట్లు ఇవ్వకుండా పరీక్షలు రాయించ లేదంటూ నర్సింగ్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవా రం కర్నూలులోని ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ ఎదుట విద్యా ర్థులు నిరసనకు దిగారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాద్యక్షుడు భాస్కర్ నాయుడు, బీసీ సంఘం నాయకులు సాయికుమార్, గిరీష్ నిరసనకు మద్దతు తెలిపారు.
ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ ఎదుట విద్యార్థుల నిరసన
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తాము ఫీజులు కట్టినా హాల్ టికెట్లు ఇవ్వకుండా పరీక్షలు రాయించ లేదంటూ నర్సింగ్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవా రం కర్నూలులోని ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీ ఎదుట విద్యా ర్థులు నిరసనకు దిగారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాద్యక్షుడు భాస్కర్ నాయుడు, బీసీ సంఘం నాయకులు సాయికుమార్, గిరీష్ నిరసనకు మద్దతు తెలిపారు. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని భాస్కర్ నాయుడు ప్రశ్నించారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. విద్యార్థి సంఘం నాయకులు నర్సింగ్ కాలేజీకి చేరుకుని యాజమాన్యంతో మా ట్లాడేందుకు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులపై కూడా యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు. వీడియోలు తీయవద్దంటూ బయటకు వెళ్లాలంటూ సిబ్బంది దౌర్జన్యం చేశారు. మీడియాకు మద్దతుగా విద్యార్థి సంఘం నాయకులకు, కాలేజీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ జూలైలో జరగాల్సిన పరీక్షలకు ఎగ్జామ్‌కు ఫీజు కట్టించుకున్న కాలేజీ యాజమాన్యం తీరా పరీక్ష సమయానికి హాల్‌టికెట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పరీక్ష రాయలేకపోవడంతో విద్యార్థులు చదివిని చదువు వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు కట్టించుకుని తీరా పరీక్షలు రాయించకపోవడం ఇదెక్కడి న్యాయమంటూ విద్యార్థులు ప్రశ్నించారు. కాగా ఈ విషయమై కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.