సమావేశంలో మాట్లాడుతున్నఈవో శ్రీనివాసరావు
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:38 AM
శ్రీశై లం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణమాసంలోని ప్రత్యేక రోజుల్లో గర్భాలయ అభిషేకాలు రద్దు చేస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.
గర్భాలయ అభిషేకాలు రద్దు
శ్రావణమాసంలోని ప్రత్యేక రోజుల్లో మార్పు...
నంద్యాల ఎడ్యుకేషన్ (శ్రీశైలం), జూలై 7 (ఆంధ్రజ్యోతి): శ్రీశై లం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణమాసంలోని ప్రత్యేక రోజుల్లో గర్భాలయ అభిషేకాలు రద్దు చేస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. శ్రావణమాస ఏర్పాట్ల సందర్భంగా ఈవో ఆలయ అధికారులతో పరిపాలనా భవనంలో సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు శ్రావణమాస మహోత్సవాలు నిర్వహి స్తామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రావణ శనివారాలు, ఆదివారాలు, సోమవారాలు, వరలక్ష్మీవ్రతం, శ్రావణపౌర్ణమి మొదలైన 16 రోజుల పాటు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలిపేస్తామన్నారు. మిగిలిన రోజుల్లో అన్ని అభిషేకాలు కొనసాగుతా యన్నారు. రద్దీ రోజుల్లో రోజుకు మూడు పర్యాయాలు మాత్రమే స్పర్శదర్శనం ఉంటుందని, ఆగస్టు 15 నుంచి 18 వరకు స్పర్శదర్శనం పూర్తిగా నిలిపేస్తామని అన్నారు.