పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:29 AM
పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత అని పంచాయతీ సెక్రటరీ రహమత్ బాషా అన్నారు. మంగళవారం పుల్లగుమ్మి గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం సుహాసిని ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

వెల్దుర్తి, మార్చి 11(ఆంధ్రజ్యోతి):పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత అని పంచాయతీ సెక్రటరీ రహమత్ బాషా అన్నారు. మంగళవారం పుల్లగుమ్మి గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం సుహాసిని ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడిచెత్త పచ్చ రంగు డబ్బాలో, పొడిచెత్త నీలం రంగు డబ్బాలో వేసి, సిబ్బందికి అందిచాలని కోరారు. అనంతరం విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేశారు.