ఎనకౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి
ABN , Publish Date - May 25 , 2025 | 12:04 AM
మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, ఇతర ఆదివాసీ మావోయిస్టు నాయకుల ఎనకౌం టర్‌పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నేతల డిమాండ్
కర్నూలు కల్చరల్, మే 24 (ఆంధ్ర జ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, ఇతర ఆదివాసీ మావోయిస్టు నాయకుల ఎనకౌం టర్‌పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఎనకౌంటర్ హత్యలను నిర సిస్తూ కలెక్టరేట్ ఎదుట ప్రజాస్వామ్య సం ఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈకార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజాభ్యుదయ సంస్థ నాయకుడు భార్గవ నిరసన ప్రదర్శనను ప్రారం భించారు. విరసం రాష్ట్ర నాయకుడు పాణి మాట్లాడుతూ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి, మావో యిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిని హత్యచేయడం దుర్మార్గ మని, కేంద్ర ప్రభుత్వానికి కనీస మానవీయ విలువలు కూడా లేవని, పెద్దఎత్తున ప్రజాస్వామిక వాదులు ఈహత్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. పౌర హక్కుల సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి అల్లా బకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎనకౌంటర్‌లో చనిపోయినవారి శవాలను కూడా బంధు వులకు అప్పగించడం లేదని, ఇది అంతర్జాతీయ పౌర హక్కుల ఉల్లంఘన అని అన్నారు. సీపీఐ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాల కోస మే ఈ హత్యలు చేయిస్తున్నాయన్నారు. ఈనిరసనలో ఎస్‌డీపీఐ నాయకుడు చాంద్ బాషా, పీడీఎస్‌యూ నాయకుడు రమణ, రాయలసీమ విద్యావంతుల వేదిక కోకన్వీ నర్ భాస్కరరెడ్డి, ప్రజాఅభ్యుదయ సంస్థ నాయ కులు శ్రీనివాసరావు, యోహాను, కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు సుబ్బరాయుడు, విద్యావంతుల వేదిక సభ్యుడు రత్తనం ఏసేపు పాల్గొన్నారు.