మొరాయించిన ఈనామ్ సర్వర్
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:40 AM
మార్కెట్ యార్డ్‌లో సోమవారం ఈ నామ్ సర్వర్ మోరాయిం చింది. దసరా పండుగ కావడం, ఖరీఫ్ పంట దిగుబడులు చేతికందడంతో రైతులు పత్తి దిగుబడులను భారీగా తీసుకొచ్చారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిచిన టెండర్లు
ఆలస్యంగా తూకాలు
ఆదోని అగ్రికల్చర్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మార్కెట్ యార్డ్‌లో సోమవారం ఈ నామ్ సర్వర్ మోరాయిం చింది. దసరా పండుగ కావడం, ఖరీఫ్ పంట దిగుబడులు చేతికందడంతో రైతులు పత్తి దిగుబడులను భారీగా తీసుకొచ్చారు. ఉదయం రైతులు తమ కమిషన్ ఏజెంట్ దుకాణం ముందు విక్రయానికి తెచ్చిన పత్తి, వేరుశనగ, ఆముదం దిగుబడులు టెండర్‌కు ఉం చారు వ్యాపారులు బిడ్డింగ్ దాఖలు చేసే సమ యంలో సర్వర్ మోరాయించడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వర్ కోసం వేచి చూశారు. అధిక దిగుబడులు విక్రయానికి రావడం మరోవైపు మేఘాలు కమ్ముకొని ఉండడంతో రైతులు ఆందోళన చెందారు. మార్కెట్ యార్డ్ అధికారులు విజయవాడ ఈనామ్ సాస్ట్‌వేర్ సిబ్బందితో చర్చించినా ఫలితం లేకపోవడంతో వెంటనే మ్యానువల్‌గా టెండర్ దాఖలు చేయాలని మైక్ ద్వారా అనౌన్స్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం 6:30గంటల వరకు కొనసాగింది. టెండర్ ఆలస్యంతో రాత్రి తూకాలు కొనసాగాయి. రైతులకు ఇబ్బంది కలగకుండా మాన్యువల్ టెండర్‌తో తూకాలు జరిపామని మార్కెట్ యార్డ్ కార్యదర్శి గోవింద్ తెలిపారు.