వెలవెలబోతున్నాయ్..!
ABN , Publish Date - May 09 , 2025 | 12:55 AM
వ్యవసాయ దిగుబడుల సీజన్ ముగిసింది. ఖరీఫ్, రబీ సీజన్ల పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరగడం లేదు. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీలోని ప్లాట్‌ఫాంలన్నీ పంట ఉత్పత్తులు లేక వెలవెలబోతున్నాయి.
ఆదోని అగ్రికల్చర్ , మే 8 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ దిగుబడుల సీజన్ ముగిసింది. ఖరీఫ్, రబీ సీజన్ల పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరగడం లేదు. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీలోని ప్లాట్‌ఫాంలన్నీ పంట ఉత్పత్తులు లేక వెలవెలబోతున్నాయి. వచ్చిన అడపాదడపా పత్తి, వేరుశనగ దిగుబడులు గంటలోపే క్రయ విక్రయాలు ముగుస్తున్నాయి. కూలీలు, హామాలీలు, గుమస్తాలు చెట్ల కింద కాలయాపన చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ పంట ఉత్పత్తులు చేతికొచ్చే మరో మూడునెలల వరకు ఇలాగే ఉంటుందని కూలీలు తెలిపారు. తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపాలని కోరుతున్నారు. -