‘ఉపాధి’ని యథావిధిగా కొనసాగించాలి
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:37 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీ ఎం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు.
కోవెలకుంట్ల, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీ ఎం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా నాయకుడు ఎం. సుధాకర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడానికి కుట్రలు పన్నుతోందని, వీబీజీ రామ్ జీ పేరుతో పథకాన్ని పేరు మార్చడం పూర్తి అన్యాయమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములమ్మ, జోసఫ్, సుబ్బారెడ్డి, మహేష్, రామసుబ్బయ్య, కృష్ణారెడ్డి, రాముడు, దిబ్బరాజు, మురళి, కిరణ్ పాల్గొన్నారు.