ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:13 AM
సహకార పరపతి సంఘం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ సహకార పరపతి సంఘం సమైఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు.
డోన రూరల్, డిసెంబరు 8(ఆంధ్రజోతి): సహకార పరపతి సంఘం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ సహకార పరపతి సంఘం సమైఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. సోమవారం డోన పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డోన బ్రాంచ కార్యాలయం వద్ద సహకార పరపతి సంఘాల సీఈవోలు, సిబ్బంది ఆందోళన చేశారు. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జీవో.36ను వెంటనే అమలు చేయలని, 2019-2024 కాలపు పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేసి, అప్పటివరకు మధ్యంతర భృతిని చెల్లించాలని కోరారు. అనంతరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డోన బ్రాంచ మేనేజర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డోన, ప్యాపిలి, హుశేనాపురం, బేతంచెర్ల, వెల్దుర్తి, క్రిష్ణగిరి, కోవెలకుంట్ల సహకార పరపతి సంఘాల సీఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: తమ సమస్యలను పరిష్కరించాలని సహకార పరపతి సంఘం ఉద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం కోవెలకుంట్ల పట్టణంలోని డీసీసీబీ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేశారు. వీరి ధర్నాకు బ్యాంకు చీఫ్ మేనేజర్ అమర్నా నాథరెడ్డి, సిబ్బంది ప్రతాపరెడ్డి, రామసుబ్బయ్య, ఇస్మాయిల్ మద్దతు తెలియజేశారు.