Share News

రెడ్‌ క్రాస్‌ నూతన కమిటీ ఎన్నిక

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:54 PM

ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్‌, కలెక్టర్‌ జి.రాజకుమారి ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎ్‌సలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రెడ్‌ క్రాస్‌ కమిటీ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌, డీఆర్వో రామునాయక్‌ తెలిపారు.

రెడ్‌ క్రాస్‌ నూతన కమిటీ ఎన్నిక

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్‌, కలెక్టర్‌ జి.రాజకుమారి ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎ్‌సలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రెడ్‌ క్రాస్‌ కమిటీ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌, డీఆర్వో రామునాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్‌ క్రాస్‌ కార్యకలాపాలను బలోపేతం చేయడం, సమాజ సేవలను విస్తరించడమే లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత కమిటీలోని కొంతమంది సభ్యులతో పాటు పట్టణంలోని ప్రముఖ వైద్యులను, విద్యాసంస్థల ప్రతినిధులను ఎన్నుకున్నట్లు వివరించారు. అలాగే కొంతమంది పట్టణ ప్రముఖులను ఎక్స్‌- ఆఫీషియో సభ్యులుగా చేర్చనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో రెండోసారి చైర్మన్‌గా దస్తగిరి పర్ల, వైస్‌ చైర్మన్‌గా డా. మమతారెడ్డి, కోశాధికారిగా నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన మేనేజ్‌మెంట్‌ కమిటీలో డా.ఆరిఫా భాను, డా.నిషితారెడ్డి, డా.నెరవాటి అరుణకుమారి, ఉస్మాన్‌ బాషా, పేరుసోముల నరసింహమూర్తి, తెలకపల్లి రాధాకృష్ణయ్య, శ్రీశైలం నాగశేషయ్య, యాకూబ్‌ తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు. చైర్మన్‌ దస్తగిరి మాట్లాడుతూ.. కలెక్టర్‌ మార్గదర్శకత్వంలో నంద్యాల జిల్లాలో రెడ్‌క్రాస్‌ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. ప్రతి కళాశాల, పాఠశాలల్లో జూనియర్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌ యూనిట్లను ఏర్పాటు చేసి, విపత్కర పరిస్థితుల్లో సహాయక సైన్యంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర కమిటీ తరపున కోశాధికారి రామచంద్రరాజు అబ్జర్వర్‌గా హాజరు కాగా కర్నూలు జిల్లా రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ డా.కేజీ గోవిందరెడ్డి, రెడ్‌ క్రాస్‌ ప్రస్తుత జిల్లా సెక్రటరీ, కలెక్టరేట్‌ ఏఓ శుభకర్‌, జిల్లా కోఆపరేటివ్‌ డివిజన్‌ అధికారి జానకిరాముడు, సబ్‌ రిజిస్ర్టార్‌ వెంకట సుబ్బయ్య తదితరులు హాజరయ్యారు.

Updated Date - Oct 08 , 2025 | 11:54 PM