బీజేపీ ఏజెంట్‌గా ఎన్నికల కమిషన్
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:33 AM
ఎన్నికల కమిషన్ బీజేపీ ఏజెంట్‌గా పనిచేస్తోందని ఏఐసీసీ సభ్యుడు, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ ఆరోపించారు.
ఏఐసీసీ సభ్యుడు, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్
కల్లూరు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్ బీజేపీ ఏజెంట్‌గా పనిచేస్తోందని ఏఐసీసీ సభ్యుడు, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ ఆరోపించారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దామోదరం సంజీవయ్య భవనం నుంచి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు శనివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్వతంత్ర వ్యవస్థ కాస్త బీజేపీలో కీలుబొమ్మగా మారిందని ఆరోపిం చారు. పవిత్రమైన ఓటు బీజేపీ అధికార దాహానికి దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల కమిషన్ తీరుపై నిప్పులాంటి నిజాలను రాహుల్‌గాంధీ బయట పెట్టారని, అయితే సమాధానం చెప్పాల్సిన ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. డిక్లరేషన్ అంటూ వెనుకుండి నాటకాలు అడిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ సంధించిన 5 ప్రశ్నలకు ఈసీ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డోన్, శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగానపల్లె నియోజకవర్గాల ఇన్‌చార్జిలు మద్దిలేటి, ఇస్మాయిల్, పుల్లయ్య, హుస్సేన్‌బాషా, నాగరాజు, బాలు యాదవ్, కర్నూలు నగర ఇన్‌చార్జి జిలానీబాషా, నాయకులు అనంతరత్నం మాదిగ, జనార్దన్, వై.సంజీవ్‌కుమార్, రాజాక్ వలి, హబీబ్ పఠాన్, జాకీర్ హుస్సేన్, ఆరిఫ్, మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.