గణేశ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:28 AM
నగరంలో వచ్చే నెల 4న నిర్వహించనున్న గణేశ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ సంబంధిత అధికారు లను ఆదేశించారు.
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): నగరంలో వచ్చే నెల 4న నిర్వహించనున్న గణేశ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ సంబంధిత అధికారు లను ఆదేశించారు. శుక్రవారం ఆయన మున్సిపల్, పలు శాఖల అధికారులతో కలిసి వినాయక ఘాట్‌ను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ గణేశ నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తకుండా అవస రమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసీ కెనాల్‌కు మర మ్మతు పనులు, ఘాట్‌కు పెయింటింగ్, వేదిక, సౌండ్ సిస్టం, క్రేన్లు, గజ ఈతగాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ బాబుప్రసాద్, తహసీల్దారు రవికుమార్, ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈ గంగాధర్, ఏఈ భాను ప్రకాష్, టౌన ప్లానింగ్ సూపర్‌వైజర్ అంజాద్‌బాషా, సీఐలు శేషయ్య, హేమంత కుమార్‌రెడ్డి, నాగరాజారావు, పార్థసారథి, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన, శంకరయ్య పాల్గొన్నారు.