ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే కోట్ల
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:12 AM
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకా శ రెడ్డి అన్నారు.
డోన టౌన, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకా శ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ ప్రజలు ఏ సమస్య వచ్చి నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసే బాధ్యత మీదేనని నాయకులను సూచించారు. నాయ కులు లక్కసాగరం లక్ష్మీ రెడ్డి, బేతంచెర్ల పట్టణ, మండల అధ్య క్షులు బుగ్గన ప్రసన్నలక్ష్మి, ఎల్ల నాగయ్య పాల్గొన్నారు.