Share News

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి: మాజీ మంత్రి

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:24 AM

వైసీపీ బలోపేతానికి నాయ కులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి అన్నారు.

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి: మాజీ మంత్రి
మాట్లాడుతున్న మాజీ మంత్రి బుగ్గన

బేతంచెర్ల, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ బలోపేతానికి నాయ కులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైసీపీ కార్యాలయంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలమవుతున్నా ఎలాంటి అభి వృద్ధి జరగలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యా వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. మద్దిలేటి స్వామి క్షేత్రం రూ.20 లక్షలతో ముఖద్వారం, రూ.50లక్షలతో ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మం జూరైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. బేతంచెర్ల పట్టణంలో ఎంజేపీ పాఠశాల, ప్రభుత్వ ఐటీఐ పనులు కూడా ఇంత వరకు టీడీపీ ప్రభుత్వం చేపట్టకపోవడం ఎంత వరకు సమంజసం అన్నారు. తమ హయాంలో స్విమ్మింగ్‌ ఫూల్‌ ఏర్పాటు చేశామని, అది కూడా మూసి వేసిందన్నారు. పార్టీ ప్రతిష్టతకు గ్రామ, వార్డు కార్యదర్శుల కార్యనిర్వహక సభ్యులు నియామకం జరుగుతుందన్నారు. ఈ సమావేశం లో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్గి, నగరపంచాయతీ చైర్మన చలం రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, మండల కన్వీనర్‌ తిరుమలేష్‌ రెడ్డి, నాయకులు నాగరాజు, మురళికృష్ణ, నగర పంచాయతీ కన్వీనర్‌ పిట్టల జాకీర్‌, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 12:24 AM