Share News

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:02 AM

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు.

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి
ఎమ్మెల్యే కోట్లకు బొకే అందజేస్తున్న నూతన కార్యవర్గ సభ్యులు, టీడీపీ నాయకులు

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు. శుక్రవారం నంద్యాల జిల్లా టీడీపీ కార్యద ర్శిగా నూతనంగా నియమితులైన డోన మండలం అభిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన గోవిందు సతీమణి ఉమాదేవి, బేతంచెర్ల మండల కార్యదర్శిగా నియమితులైన బలపాలపల్లె గ్రామానికి చెందిన ఉన్నం సుధాకర్‌ లు వేర్వేరు సమయాల్లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డిని మర్యాదపూర్వ కంగా కలిసి బొకే అందించి శాలువతో సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోట్ల వారికి దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందరూ కష్టపడాలన్నారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు అభిరెడ్డిపల్లె గోవిందు, చనుగొండ్ల వెంకోబరావు, గోసానిపల్లె శ్రీరాములు, వలసల సుధాకర్‌, వెంకటాపురం మోహన, ఉడు ములపాడు ఆదినారాయణ, కొచ్చెర్వు అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:02 AM