ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:29 AM
ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుజాత అన్నారు.
ఆళ్లగడ్డ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుజాత అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సోమవారం ర్యాలీ నిర్వహించారు. సూపరిం టెండెంట్ సుజాత జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు. ప్రభుత్వ నోడల్ అధికారి మధుశేఖర్, మల్లేశ్వరరెడ్డి, చైతన్య ఎడ్యుకేషనల్ నిర్వాహకులు వర్థన్న చారి, అశా, అంగనడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలో జాతయ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సోమవారం వైద్యులు అంజలి, సూపర్ వైజర్ రామ లింగారెడ్డి, కమ్యూనిటీ హెల్త్ అధికారి సురేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు, వైద్య సిబ్బంది కలిసి ర్యాలీ చేశారు. ఆరోగ్య విస్తరణాఽ దికారులు వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు, ఎల్‌టీ నాయక్ పాల్గొన్నారు
శిరివెళ్ల: హెచఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదని శిరివెళ్ల పీహెచసీ వైద్యులు ముఖేష్, ఆంజనేయులు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా శిరివెళ్లలో వైద్య సిబ్బంది సోమవారం ర్యాలీ నిర్వ హించారు. అదేవిధంగా మండలంలోని యర్రగుంట్ల గంగుల తిమ్మారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాళాలలో అధ్యాపకులు, యర్రగుంట్ల పీహెచసీ వైద్య సిబ్బంది, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఙ చేశారు. ప్రిన్సిపాల్ ఇంద్రావతి, వైద్యుడు ఫిరోజ్ పాల్గొన్నారు.
డోన రూరల్: పట్టణంలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం ఘనంగా నిర్వహించారు. డోన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డోన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూప రింటెండెంట్ హనీఫ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పులిపాటి కృష్ణయ్య పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎయి డ్స్ కారణాలు, నివారణ మార్గాలపై ప్రిన్సిపాల్ కృష్ణయ్య అవగాహన కల్పిం చారు. విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ క్విజ్ పోటీలు నిర్వహించారు.
ఉయ్యాలవాడ: హెచఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదని హెల్త్ సూపర్‌వైజర్ దస్తగిరి అన్నారు. ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సోమవారం స్థానిక ఆదర్శ పాఠశాల నుంచి బస్టాండ్ ఆవరణం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కూడాల నారా యణరెడ్డి, ఉపాధ్యాయులు, ఏఎనఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
బనగానపల్లె: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధి నివారణ దినం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహిం చారు. ఎయిడ్స్ వ్యాధి వల్ల కలిగే దుష్ఫలితాలను అధ్యాపకులు విద్యార్థు లకు వివరించారు. ప్రిన్సిపాల్ సత్యప్రపూర్ణ, ఎనఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆనంద్, రెడ్ రిబ్బన క్లబ్ కో-ఆర్డినేటర్ కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.