యాస్పిరేషనల్ బ్లాక్‌ల అభివృద్ధికి కృషి చేయాలి
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:18 PM
యాస్పిరేషనల్ బ్లాక్‌ల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.
కర్నూలు కలెక్టరేట్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): యాస్పిరేషనల్ బ్లాక్‌ల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, అదనపు కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీతి అయోగ్ సీఈవో మాట్లాడుతూ జూలై 28, 2025 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ గురించి వివరించారు. నిర్దేశించిన ఆరు సూచికలు సాధించిన జిల్లాలకు అవార్డులు, ప్రశంసాపత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వీరికి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులతో మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సీపీవోను ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీవో హిమప్రభాకర్‌రాజు, ఎస్‌ఈ ఆర్‌డబ్ల్యూఎస్ నాగేశ్వరరావు, డీపీవో భాస్కర్, డీఈవో శామ్యూల్‌పాల్, హౌసింగ్ పీడీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.