ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి : గౌరు చరిత
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:38 AM
నూతనంగా ఎంపికైన పాలక మండలి చైర్మన, సభ్యులు ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు.
ఓర్వకల్లు, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): నూతనంగా ఎంపికైన పాలక మండలి చైర్మన, సభ్యులు ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని పూడిచెర్ల గ్రామంలో వెలసిన రామలింగేశ్వర, వీరభద్ర, చెన్నకేశవ, ఆంజనేయ స్వామి నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ హాజరయ్యారు. చైర్మనగా చిన్న నారాయణ, సభ్యులుగా వెంకట లక్ష్మమ్మ, మల్లేశ్వరి, మంగలి ఎల్లమ్మ, సంజీవరెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఇందిరమ్మ, చాకలి పెద్దమ్మ, ప్రవీణ్‌రావులను దేవదాయ శాఖ ఇన్సపెక్టర్ రమేష్, ఆలయ ఇనచార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు ఎమ్మెల్యేకి మేళాతాళాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పూడిచెర్ల గ్రామంలో పురాతన దేవాలయాలు ఉన్నాయని పాలక మండలి సభ్యులు వాటి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. త్వరలో జరిగే సర్పంచ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఘన విజయంతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ రఘురాం, ఈవో మద్దిలేటి, టీడీపీ నాయకులు విశ్వేశ్వరరెడ్డి, నాగముని, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, పుల్లారెడ్డి, కల్లెం తిరుపాలు, శివుడు, ప్రకాశం,పాణ్యం తిరుపాలు, రాజన్న, వెంకటపతి, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.