Share News

స్త్రీ,శిశు సంక్షేమం కోసం కృషి : కలెక్టర్‌

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:36 PM

ప్రభు త్వాలు స్ర్తీ, శిశు సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నాయని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

స్త్రీ,శిశు సంక్షేమం కోసం కృషి : కలెక్టర్‌
పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

నంద్యాల నూనెపల్లె, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వాలు స్ర్తీ, శిశు సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నాయని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శనివార కలెక్టరేట్‌లో సీడీపీవో, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తల్లిలాంటి ప్రేమను అంగన్‌వాడీ కేంద్రాలు అందించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమా వేశాల్లో విద్యా, ఆరోగ్యం, స్ర్తీ శిశు సంక్షేమ శాఖకు ఎక్కువగా బడ్జెట్‌ కేటాయిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలిచ్చే తల్లులకు ఎన్నో వేల కోట్లు ఖర్చుచేసి పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నారన్నారు. ఆడాప్సన్‌ పోస్టర్లను విడుదల చేశారు. వన్‌స్టాప్‌ సెంటర్‌ మిషన్‌ వాత్సల్య వంటి వాటిపై చర్చించారు. కార్య క్రమంలో సీడీపీవో లీలావతి, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

శత జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

భగవాన్‌ సత్యసాయిబాబా శత జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా ప్రతి మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో సేవా సంఘాల సహకారంతో ఘనంగా నిర్వహించాల న్నారు. రైతుల అభ్యుతన్నతికి దోహదపడే మీకోసం రైతన్న కార్యక్రమాన్ని ఈనెల 24 ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమాలను అందరూ కలిసి విజయవంతం చేయాలన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:36 PM