Share News

ఆలయాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:20 AM

శ్రీకృష్ణ ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

ఆలయాభివృద్ధికి కృషి
భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణ ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని న్యూ రిజిస్ర్టార్‌ కార్యాలయ వద్ద ఉన్న శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే కోట్ల ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి అందరూ సహక రించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్‌ సుంకన్న, వెంకటనాయునిపల్లె శ్రీనివాసులు యాదవ్‌, సోమేష్‌ యాదవ్‌, లక్ష్మీనారాయణ యాదవ్‌, గురుస్వామి యాదవ్‌, రాముడు యాదవ్‌, శేఖర్‌ యాదవ్‌, శ్రీను, కృష్ణమూర్తి, ప్రకాష్‌ పాల్గొన్నారు.

క్రీడా సామగ్రి పంపిణీ: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడాకా రులకు ఎమ్మెల్యే కోట్ల సొంత నిధులతో జెర్సీలు, షూస్‌, ఫుట్‌బాల్స్‌ను పంపిణీ చేశారు. లక్ష్మీరెడ్డి, పీఈటీ మోహన, ఉమర్‌ పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే

ప్యాపిలి: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానికి ప్రభుత్వ విశ్రాంత భవనంలో ఆయన గ్రీవెన్స కార్యక్రమాన్ని నిర్వహించారు. మం డలంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. కోట్ల మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరతిగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ వెంకటరామిరెడ్డి, తహ సీల్దారు భారతి, ఎంపీడీవో శ్రీనివా సరావు, ఏఈలు ప్రభాకర్‌రెడ్డి, మనో హర్‌, వినయ్‌కుమార్‌, ఏవో రాజష్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:20 AM