మొక్కజొన్నపై చలి ప్రభావం
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:33 AM
ప్రస్తుతం మొక్కజొన్న పంటపై చలి ప్రభావం చూపుతోంది. చలి పెరగడంతో మొక్కజొన్న పంటలో ఆకుల ముడుచుకుపోతున్నాయి.
ముడుచుకుపోతున్న ఆకులు
తగ్గుతున్న దిగుబడులు
గోనెగండ్ల, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం మొక్కజొన్న పంటపై చలి ప్రభావం చూపుతోంది. చలి పెరగడంతో మొక్కజొన్న పంటలో ఆకుల ముడుచుకుపోతున్నాయి. ఇటీవల ఎమ్మిగనూరు ప్రాంతంలో ఉదయం పొలాలపై అఽధికంగా మంచు కురుస్తుండటం తో పంటలు దెబ్బతింటు న్నాయని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు. గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు, మంత్రాలయం మండలాలలో 10వేల ఎకరాల పైగానే మొక్కజొన్న పంటను సాగుచేశారు. ఆకులు ముడుచుకుపోయి పంట దిగుబడులు తగ్గిపోతాయని అధికారులు తెలు పుతున్నారు. ఆకులు మడుచుకొని పోయే సమస్యను ఏడీఏ మహుమ్మద్ ఖాద్రీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రెండు రోజులు పొలాల్లో పర్యటించి రైతులకు సూచనలు సలహాలు అందజేశారు.
పరిష్కార మార్గాలు
సమయంకు నీటి తడులు ఉండాలి. మొక్కజొన్నలో కీలక దశ అయిన మోకాలి ఎత్తుదశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. కేవలం యూరియానే కాకుండా సిఫార్సు చేసిన మోతాదులో పోటాష్, (ఒక కిలో పిచికారి లేదా ఎకరంకు 25 కిలోలో భూమిలో చల్లాలి), జింక్ సల్పేట్ (ఎకరానికి 500 గ్రాములు నీటిలో కలిపి పిచికారి లేదా 5 నుంచి 10కిలోలో భూమిలో చల్లుకో వాలి) ఆకులు ముడుచుకోపోవడం అనేది ఒత్తిడి లక్షణమే కాని వ్యాధి కాదు. రైతులు జాగ్రత్తలు పాటించి దిగుబడిని పెంచుకోవాలి.