ఈరన్న స్వామి హుండీ లెక్కింపు
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:31 PM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి దేవ స్థానంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహిం చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు.
నాలుగు రోజులకు రూ.92లక్షలు ఆదాయం
ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు
కౌతాళం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి దేవ స్థానంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహిం చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా నాలుగు రోజుల్లో భక్తులు సమర్పిం చిన కానుకలను దేవస్థానపు కాలక్షేపపు మండపం నగదు రూపంలో రూ.92,09,323, 50 విదేశీ డాలర్లు, బంగారం19 గ్రాముల, 500మిల్లి గ్రాములు, వెండి 23కిలోల 100 గ్రాములు వచ్చినట్లు డీసీ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులకు భక్తులు ఇలా తమవంతు సహకారాలు అందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేష్, ఆదోని గ్రూపు ఆలయ పర్యవేక్షులు, ఆలయ అధికారులు మల్లికా ర్జున, వెంకటేశ్వరరావు, దేవాలయపు ఉప ప్రధానఅర్చకులు మహదేవప్ప, అర్చకులు నాగరాజుస్వామి, శివన్నస్వామి, బ్యాంకు సిబ్బంది, ఆలయ అర్చక సిబ్బంది, దేవస్థానపు సిబ్బంది పాల్గొన్నారు.