Share News

మోదీ గుప్పిట్లో ఎన్నికల కమిషన్‌

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:06 AM

ప్రధాని మోదీ గుప్పిట్లో ఎన్నికల కమిషన్‌ ఉందని, దీంతో దేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపిం చారు. గురువారం పత్తికొండకు వచ్చిన ఆయన సీపీఐ కార్యాలయంలో మాట్లాడారు

మోదీ గుప్పిట్లో ఎన్నికల కమిషన్‌
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

పీ-4తో పేదరిక నిర్మూలన అసాధ్యం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

పత్తికొండ టౌన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ గుప్పిట్లో ఎన్నికల కమిషన్‌ ఉందని, దీంతో దేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపిం చారు. గురువారం పత్తికొండకు వచ్చిన ఆయన సీపీఐ కార్యాలయంలో మాట్లాడారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తారని గుర్తించిన మోదీ ఈసీతో కుమ్మక్కై 60 లక్షల ఓట్లు తొలగిం చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టినా ఈసీ చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. ఇందుకు నిదర్శనం బెంగళూరులోని ఓ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో ఆరు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థికి మెజార్టీ వస్తే ఒక సెగ్మెంట్‌లో మాత్రం లక్ష పై చిలుకు దొంగ ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలిచారన్నారు. ఇంత జరుగు తున్నా సీఎం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, ప్రతిపక్షనాయకుడు జగన్‌ నోరు మెదపడం లేదన్నారు. పీ-4తో పేదరిక నిర్మూలన అసాధ్యమన్నారు. రామచంద్రయ్య, గిడ్డయ్య, రాజాసాహెబ్‌ ఉన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 01:06 AM