విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:47 AM
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సాయి ఉదయ్ డిమాండ్ చేశారు.
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సాయి ఉదయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వ ర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సాయి ఉదయ్ మాట్లా డుతూ ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయా లన్నారు. నగరంలో కేవీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతిని కల్పించాలన్నారు ఎమ్మిగనూరు, ఆలూరు మండలాల కేంద్రంలో ప్రభుత్వం బాలికల బీసీ ప్రీమెట్రిక్ సంక్షేమ వసతి గృహం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న పీడీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ రంజిత బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి రంగప్ప, శ్రీనివాసులు, అంజి, విజయ్, అమర్ పాల్గొన్నారు.