Share News

ఇక ప్లాను మంజూరు సులువు

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:55 PM

మున్సిపాలిటీ పరిఽధిలో ప్లాన్ల మంజూరులో ఉన్న కఠిన నిబంధనల కా రణంగా ప్లాన్ల సంఖ్య తగ్గిపోవడాన్ని గమనించిన ప్రభు త్వం సడలింపులు ఇస్తూ ఈనెల 26న ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ప్లాను మంజూరు సులువు
ఆదోని మట్కర్‌ వీధిలోని చిన్న సందు

ఇరుకు సందుల్లోని నిర్మాణాలకు నామమాత్ర రుసుంతో అనుమతినిచ్చిన ప్రభుత్వం

ఆదోని టౌన్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిఽధిలో ప్లాన్ల మంజూరులో ఉన్న కఠిన నిబంధనల కా రణంగా ప్లాన్ల సంఖ్య తగ్గిపోవడాన్ని గమనించిన ప్రభు త్వం సడలింపులు ఇస్తూ ఈనెల 26న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాత పట్టణం పరిధిలో అక్రమ కట్టడాల సంఖ్య తగ్గి అప్రూవల్స్‌ సంఖ్య పెరుగుతుందని పట్టణ ప్రణాళిక అధికారులు అంచనా వేస్తున్నారు.

కేవలం రూపాయితోనే అనుమతి

50 చదరపు మీటర్ల (1.2సెంట్లు) విస్తీర్ణంలో గ్రౌండ్‌ ప్లోర్‌, ఫస్ట్‌ ప్లోర్‌ నిర్మించే నిర్మాణాలకు ఇకపై కేవలం రూపాయి చెల్లిస్తే ప్లాన్‌ మంజూరు చేసేలా వెసులుబాటు కల్పించారు. దీంతో పేద కుటుంబాల వారు సుళువుగా ప్లాన్‌ మంజూరు పొందే అవకాశం ఉంది. ఆదోనిలోని పాత పట్టణంలో చిన్న రహదారులు, సందులు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో భవన నిర్మాణాలకు అనుమతి కావాలంటే మున్సినాలిటీకి స్థలం ఇచ్చే అవకాశం లేదు. దీన్ని గమనించిన ప్రభుత్వం నిబంధనను సడలించంది. 100 చదరపు మీటర్ల ప్లాట్‌కు రెండు మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఉన్న ప్లాట్లకు 3.6 మీటర్ల మేర రోడ్డు ఉంటే ప్లాన్‌ మంజూరు చేయడానికి అవకాశం కల్పించారు.

ఫ్రంట్‌ సెట్‌ బ్యాక్‌లో మినహాయింపు

100 చదరపు మీటర్లలోపు ఉండే ప్లాట్లకు 3 మీటర్ల వరకు, 100 నుంచి 500 చదరపు మీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు 0.75 నుంచి 2 మీటర్ల వరకు ప్రంట్‌ సెట్‌బ్యాక్‌ పాటిస్తే ప్లాను మంజూరు చేసేలా మినహాయింపు ఇచ్చారు. 3 మీటర్ల పైబడిన ఎత్తు భవనాలకు 5 అడు గుల వెడల్పుతో బాల్కనీ నిర్మించుకోవడానికి కూడా అవ కాశం కల్పించారు. దీంతో సామాన్యులకు ఊరట కలిగింది.

సామాన్యులకు ఊరట

ప్రభుత్వం ఇచ్చిన వినహాయింపు లతో పాత పట్టణంలోని సామాన్యు లకు ఊరట కలుగుతుంది. ప్లాన్‌ సుళులవుగా మంజూరవు తుంది. అనధికార కట్టడాలు తగ్గిపోయే అవకాశం ఉంది. - బాల మద్దయ్య, టీపీవో, ఆదోని.

Updated Date - Jun 30 , 2025 | 11:55 PM