డ్వాక్రా సంఘాలు సంఘటితంగా ఉండాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:25 AM
డ్వాక్రా సంఘాలు, అందులోని సభ్యులు సంఘటితంగా ఉంటే ఆర్థికంగా బలోపేతం అవుతా రని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పిలుపుని చ్చారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ఫుడ్ స్టాళ్లను పరిశీలించిన మంత్రి బీసీ
బనగానపల్లె, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాలు, అందులోని సభ్యులు సంఘటితంగా ఉంటే ఆర్థికంగా బలోపేతం అవుతా రని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పిలుపుని చ్చారు. శనివారం బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం, డ్వాక్రా సంఘాల ఫుడ్ స్టాళ్లను మంత్రి బీసీ శనివారం ప్రారంభించారు. ఫుడ్‌స్టాల్‌లో అంగనవాడీ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్‌ను, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తు లకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఆవ రణలో నాటిన మొక్కలు ఎండిపోవడంపై ఎంపీడీవో నాగరాజుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయా ఽధికారి సుబ్బారెడ్డితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిర క్షణలో భాగంగా మొక్కలను సంరక్షించాలని ఆదేశిం చారు. అనంతరం గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పదార్థాలు తీసుకుని కిరాణా సరుకులు అందిచే మొబైల్ క్యాంటినను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మండల స్పెషల్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో బాలాంజనేయులు, ఎంఈవో స్వరూప, పంచాయితీరాజ్ డీఈ నాగశ్రీనివా సులు, డీఏపీవో నాగసుంకమ్మ, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ మధుసూదన, ఏఈలు సాయికృష్ణ, వెంకటరమణ, ఈవో సతీశరెడ్డి, వెలుగు ఎపీఎం హజరత, ఏపీఎం రమణ, ఉపసర్పంచ బురానుద్దీన, సర్పంచ మహేశ్వరరెడ్డి, అత్తార్ అబ్దుల్‌కలాం, కాశీంబాష, హైదర్, అమీర్‌జాన, అల్తాఫ్ హుసేన, నియాజ్‌హుసేన, షబ్బీర్, బోదనం బాలనాగన్న, మద్దిలేటిరెడ్డి, ఇస్మాయిల్‌ఖాన తదితరులు పాల్గొన్నారు.
అంగనవాడీలకు సెల్‌ఫోన్ల పంపిణీ : బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో అంగనవాడీ కార్యకర్తలకు మంత్రి బీసీ జనార్దనరెడ్డి సెల్‌ఫోన్లను పంపిణీ చేశారు. అంగనవాడీ చిన్నారులకు, గర్భిణి, బాలింతలకు సంబంధింత వాటిని మొబైల్ యాప్‌లో ఎప్పటిక ప్పుడు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. టెక్నాలజీని వినియోగించుకొని అంగనవాడీ సేవలు మరింత విస్తృతం చేయాలన్నారు.