Share News

సెప్టెంబరు 22 నుంచి దసరా మహోత్సవాలు

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:18 AM

శ్రీశైలం క్షేత్రంలో సెప్టెంబరు 22వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

సెప్టెంబరు 22 నుంచి దసరా మహోత్సవాలు

భక్తుల కోసం ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేయాలి

సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేద్దాం

శ్రీశైల ఆలయ ఈవో శ్రీనివాసరావు

నంద్యాల కల్చరల్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం క్షేత్రంలో సెప్టెంబరు 22వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉత్సవాల నిర్వహణకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉభయ దేవాలయాల అర్చకులు, అధ్యాపక, వేదపండితులు, ఆలయ సిబ్బంది, పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్వామి అమ్మవార్లకు జరిపించాల్సిన ఆయా కైంకర్యా లను, వాహనసేవలు, ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, నిజరూపాలంకరణ, రాజరాజేశ్వరి అలకంరణ, విజయదశిమి రోజున శమీపూజ, తెప్పోత్సవం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వాహనాల పార్కింగ్‌, క్యూలైన్ల క్రమబద్దీకరణ, దర్శనం ఏర్పాట్లు, భక్తులకు అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలపై చర్చించారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. భక్తులు ఉత్సవాలను వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటుచేయాలని ఇంజనీరింగ్‌ విభాగాన్ని ఆదేశించారు. ఉత్సవాలకు సంబంధించి అధికారులకు తగు జాగ్రత్తలు తీసుకొని విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేయాలన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:18 AM