22 నుంచి లలితా పీఠంలో దసరా ఉత్సవాలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:06 AM
పాతనగరం లోని లలితా పీఠంలో ఈనెల 22 నుంచి అక్టోబరు 2 వరకు దసరా (దేవీ శరన్నవరాత్రి) ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు.
కర్నూలు కల్చరల్, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): పాతనగరం లోని లలితా పీఠంలో ఈనెల 22 నుంచి అక్టోబరు 2 వరకు దసరా (దేవీ శరన్నవరాత్రి) ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. సోమవారం లలితా పీఠం లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వివిధ ధార్మిక సంఘాల ప్రతినిఽ దులతో కలిసి ఆయన ఉత్సవాల బ్రోచర్లను విడుదల చేశారు. పీఠాధిపతి మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలకు లలితా పీఠంలో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇం దులో భాగంగా ప్రతిరోజు ఉదయం ప్రాతఃకాల సుప్రభాతం, మూర్తి అభిషేకాలు, సప్త మంగళ హారతులు, ప్రసాద వితరణ ఉంటాయ న్నారు. నిత్యం ఉచిత సామూహిక శ్రీచక్ర కుంకు మార్చనలు, శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి వార్లకు విశేష పూజ, పల్లకీ సేవ, లలితా సుందరేశ్వరస్వామి వార్లకు రథో త్సవం ఉంటుందని తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారికి విశేష అలంకరణలు, బాలబా లికలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు ఈ ఉత్సవా లను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు శ్రీరామాంజనేయులు, దాసరి రామచంద్రారెడ్డి, పూడూరు లక్ష్మీరెడ్డి, మామిళ్లపల్లి రాజేశ శర్మ, శ్రీనివాస్, గురుస్వామి పాల్గొన్నారు.