నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:23 PM
మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తిచేశారు.
హాజరుకానున్న 33,684 మంది అభ్యర్థులు
నంద్యాల నూనెపల్లె, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తిచేశారు. డీఎస్పీ పరీక్షలు ఈ నెల 6 నుంచి 30వ తేదీ వరకు కొనసాగు తాయి. నంద్యాల జిల్లా నుంచి 33,684 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణపై గురువారం కలెక్టర్ రాజకుమారి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే మెగా డీఎస్సీ పరీక్షలకు ఎలాంటి లోపాలకు తావివ్వకుండా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. జిల్లా కేంద్రంలో శ్రీరామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలు, శాంతిరామ్, ఆర్‌జీఎం, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు, లోపాలకు తావ్వికుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షలు సజా వుగా నిర్వహించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను నియమించామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశామన్నారు. పరీక్షాకేంద్రాల పరిధిలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాలని పోలీస్ అఽధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు కేటా యించిన పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగా హాజ రుకావాలని సూచించారు. పరీక్షాకేంద్రాలకు చేరుకునేలా సమయానికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని ఆదే శించారు. ఈ సమీక్షలో ఏఎస్పీ మందజావలి అల్ఫోన్స్, నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్, డీఈవో జనార్ధన్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ లీలావతి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.