Share News

డ్రోన వినియోగం అధికం: కలెక్టర్‌

ABN , Publish Date - May 03 , 2025 | 11:42 PM

పలు రంగాల్లో డ్రోన వినియోగం అధికంగా జరుగుతుందని కలెక్టర్‌ రంజిత బాషా అన్నారు.

డ్రోన వినియోగం అధికం: కలెక్టర్‌
విద్యార్థినులకు సర్టికెట్లు అందజేస్తున్న కలెక్టర్‌ రంజిత బాషా

కర్నూలు ఎడ్యుకేషన, మే 3(ఆంధ్రజ్యోతి): పలు రంగాల్లో డ్రోన వినియోగం అధికంగా జరుగుతుందని కలెక్టర్‌ రంజిత బాషా అన్నారు. శనివారం స్థానిక నందికొట్కూరు రోడ్డులోని రవీంద్ర మహిళా ఇంజనీ రింగ్‌ కళాశాలలో డ్రోన్సకు సంబంధించిన ల్యాబ్‌ను కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి దశలోనే ఉన్నతమైన నైపుణ్యాలను పెంచుకోవాల న్నారు. రవీంద్ర మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో డ్రోన వినియోగంపై ట్రిపుల్‌ ఐటీ అధ్యాపకులతో శిక్షణ నిర్వహించారన్నారు. డ్రోన ఆపరేటి వ్‌పై శిక్షణ పొందిన విద్యార్థులతో డ్రోన ఫ్లయింగ్‌ గురించి వాటి పనితీరు గురించి ప్రత్యక్షంగా కలెక్టర్‌ పరిశీలించారు. రవీంద్ర మహిళా ఇంజనీ రింగ్‌ కళాశాల అధినేత గూడూరు పుల్లయ్య, చైర్మన జీవీఎం మోహన కుమార్‌, ప్రిన్సిపాల్‌ కేఈ శ్రీనివాసమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించండి

కర్నూలు హాస్పిటల్‌: శ్రీశైలం దర్శనాంతరం తిరిగి వస్తూ నంద్యాల జిల్లా బైర్లూటి సమీపంలో ప్రమాదానికి గురై గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ రంజిత బాషా ఆస్పత్రి అధికారు లను ఆదేశించారు. శనివారం ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థో విభాగంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. పురుషుల, స్త్రీల వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగు లకు మెరుగైన చికిత్స అందించాలని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వర్లును కలెక్టర్‌ ఆదేశించారు. ఆయన వెంట హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ సిందూ సుబ్రహ్మణ్యం, నాయీబ్రాహ్మణ కార్పొరేషన డైరె క్టర్‌ విజయకుమార్‌, రాష్ట్ర కార్యదర్శి రంగ స్వామి ఉన్నారు.

కార్డియాలజీలో నూతన బెడ్లను ప్రారంభించిన కలెక్టర్‌

కర్నూలు సర్వజన ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటుచేసిన 30బెడ్లను కలెక్టర్‌ రంజితబాషా శనివారం ప్రారంభిం చారు. ఫేస్‌మేకర్‌ వేయించుకున్న రోగులు, గుండె సంబంధిత చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి కలెక్టర్‌ పరామర్శించారు. అనంతరం కార్డియాలజి విభాగం క్యాతలాబ్‌లో జరుగుతున్న యాంజియోగ్రామ్‌ సర్జరీని కలెక్టర్‌ ప్రత్యక్షంగా వీక్షించారు. సూపరింటెండెంట్‌ కె.వెంకటే శ్వర్లు, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ కె.చిట్టినరసమ్మ పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:42 PM