శ్రీశైలంలో డ్రోన్ చక్కర్లు
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:55 PM
శ్రీశైల ఆలయం పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టింది. స్థానికుల సమాచారంతో దేవస్థానం భద్రతా విభాగం, స్థానిక పోలీసులు అప్రమత్తమ య్యారు.
శ్రీశైలం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల ఆలయం పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టింది. స్థానికుల సమాచారంతో దేవస్థానం భద్రతా విభాగం, స్థానిక పోలీసులు అప్రమత్తమ య్యారు. శ్రీశైలంలో గల శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద డ్రోన్ ఎగురవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన పవన్‌గా గుర్తించారు. స్థానికంగా ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చి అవగాహన లోపంతో డ్రోన్‌ను ఎగురవేసినట్లు తెలిసింది. అతని వద్ద నుంచి అధికారులు డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయంపై వన్‌టౌన్ సీఐ ప్రసాదరావుతో మాట్లాడగా ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు.