Share News

ఇరవై రోజులకోసారి తాగునీరు

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:31 AM

మండలం లోని ములుగుందం గ్రామంలో తాగునీటి ఎద్దడితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో 10వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. 20 రోజులకోసారి నీరు వస్తోందని ఆరోపిస్తున్నారు.

ఇరవై రోజులకోసారి తాగునీరు
మినీ ట్యాంకుల వద్ద నీటి కోసం వేచి ఉన్న గ్రామస్థులు

ములుగుందంలో తాగునీటి ఎద్దడి

పట్టించుకోని గ్రామ పంచాయతీ అధికారులు

ఆస్పరి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): మండలం లోని ములుగుందం గ్రామంలో తాగునీటి ఎద్దడితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో 10వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. 20 రోజులకోసారి నీరు వస్తోందని ఆరోపిస్తున్నారు. గ్రామానికి సమీపంలోని ఊరి వంకలో వేసిన బోరు అడుగంటడంతో సమస్య ఏర్పడిందన్నారు. తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. అదనంగా మరో బోరు వేస్తే సమస్య తీరుతుం దన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ బోర్ల వదకు వెళ్లి నీరు తెచ్చుకోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామంలోని తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:31 AM