తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 01:02 AM
మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి
సి.బెళగల్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిషత కార్యాలయంలో ఎంపీపీ బొంతల మునెప్ప అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్యఅథిగా ఎమ్మెల్యే దస్తగిరి హాజరై మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో బోర్లు, విద్యుత మోటార్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలన్నారు. తాగునీటి పైపులైన్లు మురుగు కాలువలలో ఉంటే వాటిని తొలగించాల న్నారు. మండలంలోని వైద్యులు విధులకు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నా రని సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. మండల సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాలని ఎంపీడీవో రాణెమ్మను ఆదేశించారు. ఈసమావేశంలో తహసీల్దార్ పురుషోత్తం, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికా రులు పాల్గొన్నారు.