ప్రజల దృష్టి మరల్చేందుకే డ్రామాలు
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:29 AM
కుంభకోణాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ వెన్నుపోటు ధర్నా డ్రామాలు ఆడు తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత విమర్శించారు.
గొడ్డలిపోటు దినం జరుపుకోండి
జగన ముఠా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
వైసీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, జూన 3 (ఆంధ్రజ్యోతి): కుంభకోణాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ వెన్నుపోటు ధర్నా డ్రామాలు ఆడు తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత విమర్శించారు. మంగళవారం మాధవీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వ హించారు. ఈసందర్బంగా గౌరుచరిత మాట్లాడుతూ అసలైన వెన్ను పోటు దారుడు జగనరెడ్డి.. వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగేదొంగ అన్నట్లు ఉందని గోడ్డలి పోటు దినం కూడా జరుపుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వంపై జగన ముఠా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, సీఎం చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పాలనను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకుని ఆదే పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీని స్థాపించారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి పాలనలో తొలి ఏడాదిలోనే 70శాతం హామీలను అమలు చేశామని, ఎన్టీఆర్ భరోసా పింఛన రూ.4వేలకు పెంచామని, 16,347 పోస్టులతో మోగా డీఎస్సీ నోటిఫికేషన ఇచ్చి మొదటి సంతంకం మాట నిలబెట్టుకున్నామన్నారు. వైసీపీ దుష్ప్రచా రాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కార్యక్రమంలో పెరుగు పురుషోత్తం రెడ్డి, ఆర్.చంద్రకళాధర్‌రెడ్డి, ప్రభాకర్ యాదవ్, పీయూ మాదన్న పాల్గొన్నారు.