డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:47 AM
డ్రైనేజీ సమస్యను పరిష్కరించా లని కోరుతూ మహిళలు రోడ్డుపై బైఠాయించారు.
గూడూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): డ్రైనేజీ సమస్యను పరిష్కరించా లని కోరుతూ మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మంగళవారం గూడూరు పట్టణంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఓ మోస్తరు వర్షం కురవడంతో నీరు డ్రైనేజీలో ముందుకు వెళ్లలేక నిలిచిపోవడం, ఆ నీరు ఎటూ వెళ్లలేక తెలుగు వీధి కాలనీలోని ఇళ్లలోకి చేరడంతో ఆగ్ర హించిన మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. టీడీపీ గూడూరు పట్టణ అధ్యక్షుడు కే. రామాంజనేయులు అక్కడకు చేరుకుని మహిళలతో మాట్లాడి సమస్యను కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.