అహోబిలంలో ద్వార తోరణ పూజ
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:33 AM
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో లక్ష్మీనరసింహాస్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో వేద పండితులు ద్వార తోరణం కార్యమాన్ని నిర్వహించారు.
ఆళ్లగడ్డ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో లక్ష్మీనరసింహాస్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో వేద పండితులు ద్వార తోరణం కార్యమాన్ని నిర్వహించారు. పవిత్రోత్సవాలలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుని ఆరాధించి పూజలు నిర్వహించారు. ఽధ్వజాన్ని ఆలయ ధ్వజస్తభంపై ఆరోహణం చేశారు. భేరి పూజతో సమస్త దేవతలకు ఆహ్వానం పలికారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు కిడాంభి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో విశ్వరూపం, నవకలశ స్థాపన పూర్వక తిరుమంజనం, యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్ల మూలవిరాట్, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.