సర్వేలో తక్కువ భూమి వస్తే ఆందోళన చెందొద్దు
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:54 AM
భూములను సర్వే చేసే సమయంలో ఒకరికి తక్కువ, మరొకరికి ఎక్కువ భూమి వచ్చిందని రైతులు ఆందోళన చెందవద్దని, అన్నింటిని సరిచేస్తామని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అన్నారు.
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్
గోనెగండ్ల, జూన 4(ఆంధ్రజ్యోతి): భూములను సర్వే చేసే సమయంలో ఒకరికి తక్కువ, మరొకరికి ఎక్కువ భూమి వచ్చిందని రైతులు ఆందోళన చెందవద్దని, అన్నింటిని సరిచేస్తామని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అన్నారు. బుఽధవారం మండల పరిఽఽధిలోని గంజ హళ్లి, పెద్దనేలటూరు గ్రామాలలో జరుగుతున్న భూ రీసర్వే పనులకు గాను సబ్ కలెక్టర్ గ్రామ సభలు నిర్వహించారు. రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు సమస్యలు తెలియజేశారు. రికార్డులను తనిఖీ చేశారు. గంజహళ్లి గ్రామంలో భూసర్వే పనులకు గాను ఆరుమంది సర్వే యర్లును ముగ్గురు వీఆర్వోలను నియమిస్తున్నామని, ప్రతి రోజు రైతుల సమక్షంలో భూ సర్వేలు చేస్తామని తెలిపారు. అలాగే పెద్దనేలటూరు గ్రామంలో రీసర్వే పనులను పరిశీలించారు. రైతుల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి, శ్రీనివాసరాజు, శిరీష, పలు గ్రామాల వీఆర్‌ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు.