మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దు
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:24 AM
మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని డీఎస్పీ హేమలత సూచించారు. శుక్రవారం స్థానిక రోషన్ గార్డెన్‌లో మాదక ద్రవ్యాల వినియోగం, నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహిం చారు.
విద్యాసంస్థలలో క్రీడలపై దృష్టి పెట్టాలి : డీఎస్పీ హేమలత
ఆదోని, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని డీఎస్పీ హేమలత సూచించారు. శుక్రవారం స్థానిక రోషన్ గార్డెన్‌లో మాదక ద్రవ్యాల వినియోగం, నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహిం చారు. డీఎస్పీ మాట్లాడుతూ యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఒత్తిడికి లోనై సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ప్రభావంతో డ్రగ్స్‌కు అలవాటు పడటం విచారకరమన్నారు. ఒత్తిడిని జయించేందుకు యోగా, ధ్యానం, క్రీడలపై దృష్టి సారించాలన్నారు. కళాశాలల యాజమాన్యాలు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలను ప్రోత్సహించాలని, పాఠశాలలు, కళాశాలలకు వంద మీటర్ల లోపు సిగరెట్లు, మద్యం విక్రయించకూ డదన్నారు. ఈ నిబంధనను ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా నేరమన్నారు. కేసు నమోదైతే పదేళ్లకు పైబడి జైలు శిక్ష, రూ.లక్షకు పైగా జరిమానా ఉంటుందన్నారు. జైలు శిక్ష అనంతరం బయటకు నిందితులపై పోలీసు నిఘా ఉంటుందని, ఎక్కడ ఆ కేసుకి సంబంధించిన మూలాలు ఉన్నా పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఐ నల్లప్ప, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.