Share News

డ్రగ్స్‌కు బానిస కావొద్దు

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:23 AM

డ్రగ్స్‌కు యువత బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే పార్థసారథి, సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, డీయస్పీ హేమలత సూచించారు. మాద ద్రవ్యాల వ్యతిరేక దినో త్సవ సందర్భంగా గురువారం పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు.

డ్రగ్స్‌కు బానిస కావొద్దు
ఆదోనిలో ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, సబ్‌ కలెక్టర్‌, డీఎస్పీ

ఎమ్మెల్యే, సబ్‌ కలెక్టర్‌, డీఎస్సీ

ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజవర్గాల్లో

మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం, విద్యార్థులతో ర్యాలీ

ఆదోని, జూన్‌26(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌కు యువత బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే పార్థసారథి, సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, డీయస్పీ హేమలత సూచించారు. మాద ద్రవ్యాల వ్యతిరేక దినో త్సవ సందర్భంగా గురువారం పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. చెడు స్నేహాలు, పరిస్థితుల ప్రభావంతో తాత్కాలిక ఆనందం కోసం గంజాయికి అలవాటుపడితే రుగ్మతల బారిన పడతారన్నారు. మాదకద్రవ్యాలు కలిగి ఉండడం, తీసుకోవడం, సరఫరా, తయారీ, క్రయ, విక్రయాలు క్రిమినల్‌ నేరాలని, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిం చారు. సీఐలు శ్రీరామ్‌, గంటా సుబ్బారావు, రాజశేఖర్‌రెడ్డి, రామలింగమయ్య పాల్గొన్నారు.

పత్తికొండ: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆర్డీవో భరత్‌నాయక్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురు వారం పట్టణంలోన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్‌ మాయలో తప్పుదారిలోకి వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిం చారు. ఎక్సైజ్‌ సీఐ స్వర్ణలత, తహసీల్దార్‌ నూర్‌అహ్మద్‌, ఎంపీడీవో శ్రీదేవి, సీఐలు జయన్న, పులిశేఖర్‌, కడవల సుధాకర్‌, బత్తిని లోక్‌నాథ్‌, బిటీ గోవిందు పాల్గొన్నారు.

ఆలూరు: యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హౌసింగ్‌ పీడీ చిరంజీవి, సీఐలు రవిశంకర్‌, లలితదేవి కోరారు. గురువారం పట్టణంలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఐ మహబూబ్‌ బాషా, నవీన్‌, షరీఫ్‌, ఎంఈఓ కోమలదేవి, ఆర్‌ఐ బసవన్నగౌడ్‌, హౌసింగ్‌ ఏఈ విజయ్‌కుమార్‌, గంగమ్మ, నరసప్ప, హనుమప్ప పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:23 AM