Share News

పరిమితికి మించి ఎక్కించుకోవద్దు

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:22 PM

ఆటోలు, స్కూలు బస్సులలో ప్రయాణికులు, విద్యార్థులను పరిమితికి మించి ఎక్కించుకోవద్దని పోసులు హెచ్చరిం చారు.

పరిమితికి మించి ఎక్కించుకోవద్దు
ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న పోలీసులు

కర్నూలు క్రైం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆటోలు, స్కూలు బస్సులలో ప్రయాణికులు, విద్యార్థులను పరిమితికి మించి ఎక్కించుకోవద్దని పోసులు హెచ్చరిం చారు. గురువారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు నగరంలోని కళాశాలలు, పాఠశాలల యజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని, స్కూల్‌ బస్సులలో ఓవర్‌లోడుతో ప్రయాణిస్తే ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. రాంగ్‌ రూట్లలో ప్రయాణం వద్దని, తిగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపరాదన్నారు. ఎక్కడపడితే అక్కడ వాహ నాలను నిలిపి ట్రాపిక్‌కు అంతరాయం కలిగించవద్దని సూచించారు.

ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ..

ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం నగరంలోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో విద్యాసంస్థల వద్ద యాంటీ ఈవ్‌ టీజింగ్‌ బీట్లను ఏర్పాటు చేశారు. సమస్య ఉంటే డయల్‌ 112 లేదా 100కు డయల్‌ చేయాలని దిశా నిర్దేశం చేశారు.

Updated Date - Nov 06 , 2025 | 11:22 PM